టైఫాయిడ్‌కు చికిత్స ఎలా అందిస్తారు?
సరైన సమయములో అందించబడిన చికిత్స త్వరితంగా మరియు సంపూర్ణంగా కోలుకొనుటకు దారితీస్తుంది.

టైఫాయిడ్ జ్వరము యాంటిబయాటిక్స్ తో సమర్థవంతంగా చికిత్స చేయబడుతుంది. టైఫాయిడ్ చికిత్స మీకు రోగనిర్ధారణ చేయబడిన వెంటనే ప్రారంభించబడాలి, ఎందుకంటే ఆలస్యం చేసినకొద్దీ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.[1] తక్షణ చికిత్సతో, ప్రజలు 6-7 రోజులలో కోలుకుంటారు, కాని చికిత్స ఆలస్యం అయితే, జ్వరం వారాలు లేదా నెలల కాలం కొనసాగవచ్చు. టైఫాయిడ్ జ్వరము నుండి కోలుకున్న కొంతమంది బ్యాక్టీరియాను వదులుతుంటారు మరియు సాల్మొనెల్లా టైఫి యొక్క సుదీర్ఘ వ్యాధివాహకులుగా మారుతారు.[2]
సాధారణంగా యాంటిబయాటిక్స్ తో చికిత్స టైఫాయిడ్ కు అందించబడినప్పటికీ, విచక్షణారహిత వినియోగం మరియు పాటించకపోవడం అనేవి వివిధ రకాల యాంటిబయాటిక్స్ కు యాంటిమైక్రోబియల్ ప్రతిరోధము (AMR) ను పెంచుతున్నాయి. దీనితో మరింత క్లిష్టమైన మరియు ఖరీదైన చికిత్స అవసరం అవుతుంది మరియు వైద్య సంరక్షణ ఆర్ధికంగా భారం అవుతుంది.[3]
యాంటిబయాటిక్స్
టైఫాయిడ్ జ్వరానికి అందించే చికిత్సలో ఉపయోగించే టైఫాయిడ్ మందులలో యాంటిబయాటిక్స్ ఒక ఆవశ్యక భాగము. సురక్షితమైన మరియు ప్రభావవంతమైన చికిత్స కొరకు ఖచ్ఛితమైన రోగనిర్ధారణ మరియు వైద్యుడి నిర్దేశనను అనుసరించడం అవసరం.
మీ వైద్యుడు సూచించిన యాంటిబయాటిక్స్ యొక్క పూర్తి చికిత్సను పూర్తి చేయడం ముఖ్యం. అవసరమైన మోతాదును పూర్తి చేయకపోతే, అది సరిపోని స్పందన, పునఃస్థితి మరియు అదనపు సమస్యలకు దారి తీయవచ్చు.[3]
అనుగుణమైన యాంటిబయాటిక్స్ తీసుకోకపోతే, జ్వరము 3 నుండి 4 వారాల వరకు కొనసాగవచ్చు. చికిత్స అందిస్తే, లక్షణాలు 6 నుండి 7 రోజుల లోపల మెరుగుపడవచ్చు.[4] అయితే, లక్షణాలు తగ్గిన తరువాత కూడా, అలసట మరియు బలహీనత కొన్నిరోజుల వరకు ఉండవచ్చు.

యాంటిమైక్రోబియల్ ప్రతిరోధము (AMR)

అత్యంత ఆందోళన కలిగించే ఆరోగ్య సమస్యలలో ఒకటి యాంటిమైక్రోబియల్ ప్రతిరోధము లేదా AMR.
యాంటిమైక్రోబియల్స్ అనేవి సంక్రమణలు పోరాడుటకు ఉపయోగించబడే ఔషధాలు. యాంటిమైక్రోబియల్ ప్రతిరోధము (AMR) అంటే, ఇంతవరకు ప్రభావం చూపించిన, ఈ ఔషధాలు ఈ సంక్రమణలు చికిత్సలో అసమర్థంగా మారుతాయి, తద్వారా వ్యాధి వ్యాప్తి ప్రమాదం పెరుగుతుంది మరియు అనేక తీవ్రమైన అనారోగ్యాలకు లేదా మరణానికి కూడా దారితీయవచ్చు. ఇది ఆధునిక ఔషధాల ప్రయోజనాలను ప్రమాదంలో పెడుతుంది.[5]
దురదృష్టవశాత్తు, అనేక ఇతర బ్యాక్టీరియాల మాదిరిగానే, సాల్మొనెల్లా టైఫి కూడా యాంటిబయాటిక్స్ కు ప్రతిరోధము అవుతోంది. 1వ మరియు 2వ దశ యాంటిబయాటిక్స్కు పూర్తిగా ఔషధ ప్రతిరోదకత (XDR) అయిన సాల్మొనెల్లా టైఫీ యొక్క ఒక రకము అగుబడడం మరియు ప్రపంచవ్యాప్త వ్యాప్తితో ఈ సమస్య మరింత తీవ్రం అవుతోంది.[6]
యాంటిబయాటిక్ ప్రతిరోధము కొరకు ప్రధాన కారణం మనుషులు, జంతువులు మరియు వ్యవసాయంలో దుర్వినియోగం, అధిక వినియోగం, తక్కువ-మోతాదు, అసంపూర్ణ సమయము, చెల్లుబాటు అయ్యే నిర్దేశన లేకుండా కౌంటర్ వద్ద ఔషదాల కొనుగోలు మరియు ఔషధాల ఇతర దిర్వినియోగాలు. యాంటిబయాటిక్స్ యొక్క ప్రపంచవ్యాప్త వినియోగము 2000 మరియు 2015 మధ్య 65% పెరిగింది, ముఖ్యంగా భారతదేశము వంటి తక్కువ మరియు మధ్యస్థ-ఆదాయ దేశాలలో. అనుగుణమైన చర్య లేకుండా, ఇది 2030 నాటికి మూడు రెట్లు అవుతుందని ఆశించబడుతోంది (2015తో పోలిస్తే).[7]
AMR పరిణామాలు
యంటిమైక్రోబియల్ ప్రతిరోధ సాల్మొనెల్లా టైఫి పెరుగుదలతో, సాధారణ యాంటిబయాటిక్స్ మరియు ఇతర ఔషధాలు చివరికి అసమర్థంగా అవుతున్నాయి. ఇటువంటి ప్రతిరోధకమైన జాతులు యొక్క ఆవిర్భావము టైఫాయిడ్ జ్వరము యొక్క లక్షణాలను ఎదుర్కొనుటను మరింత సవాలుగా నిలుస్తోంది, దీనితో చికిత్స మరింత క్లిష్టతరంగా మరియు ఖరీదైనదిగా అవుతోంది.[7] కొత్త యాంటిమైక్రోబియల్స్ అభివృద్ధి చేయబడుతుండగా, బ్యాక్టీరియల్ ప్రతిరోధము కూడా వేగంగా పెరుగుతోంది.[1]

అయితే, టీకాకరణ కొత్త ఔషధ ప్రతిరోదకత జాతులు పెరగడాన్ని నివారించుటలో సహాయపడుతుంది.[6]
యాంటిబయాటిక్ ప్రతిరోధమును పోరాడుటలో టీకాలు ఒక శక్తివంతమైన సాధనాలు. టీకాలు సంక్రమణ ప్రారంభం కాకమునుపే మీ రోగనిరోధక వ్యవస్థను వ్యాధికారకాలతో పోరాడుటకు శిక్షణ ఇస్తాయి. టీకాలు తీసుకున్నవారికి సంక్రమణలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది, ఇది తక్కువ యాంటిమైక్రోబియల్ నిర్దేశనలకు దారి తీస్తుంది మరియు అందుచేత సమస్యల నుండి కూడా రక్షించబడతారు.[7]
ఇంటి వద్ద సంరక్షణ
మీ వైద్యుడు నిర్దేశించిన ఔషధాలు మరియు చికిత్సలతో పాటు, మీరు ఇంటి వద్ద అనుసరించవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:[3,8]

మీ వైద్యుడు సిఫారసు చేసినంత కాలం నిర్దేశించిన ఔషధాలను తీసుకోవడం కొనసాగించండి.

శౌచాలయం ఉపయోగించిన తరువాత, ఆహారాన్ని వండేటప్పుడు మరియు వడ్డించేటప్పుడు మరియు తినే ముందు మీ చేతులను సబ్బు మరియు నీటితో బాగా కడుక్కోండి.

ఇంటివద్ద అందుబాటులో ఉండే పానీయాలను తగినంతగా తీసుకోవడం.
ఈ చర్యలను అనుసరించడం ద్వారా సంక్రమణ వ్యాప్తి అయ్యే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ఆసుపత్రిలో చేరిక
మధ్యస్థంగా ఉన్న టైఫాయిడ్ జ్వరం కేసుల కొరకు, మంచి పారిశుధ్య మరియు పరిశుభ్రమైన ఆచరణలు, నిర్దేశించిన ఔషధాలతో సహా, టైఫాయిడ్ నుండి కోలుకోవడానికి సరిపోతాయి. అయితే, ఒకవేళ జ్వరం ఇంకా ఉన్నా, లేదా రోగి అనారోగ్యంగా లేదా నిర్జలీకరణ కనిపించినా, ఆసుపత్రిలో చేరిక సిఫారసు చేయబడుతుంది.
సంబంధిత పేజీలు
వనరులు
- https://www.ncbi.nlm.nih.gov/books/NBK557513/
- https://oklahoma.gov/health/health-education/acute-disease-service/disease-information/typhoid-fever.html
- https://www.who.int/news-room/fact-sheets/detail/typhoid
- https://www.health.nsw.gov.au/Infectious/controlguideline/Pages/typhoid.aspx
- https://www.who.int/news-room/fact-sheets/detail/antimicrobial-resistance
- https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC10236512/
- https://www.who.int/publications/i/item/9789240098787
- https://www.healthdirect.gov.au/typhoid-and-paratyphoid
డిస్‌క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఉన్న ఏవైనా ప్రశ్నల గురించి ఎప్పుడు మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.