టైఫాయిడ్ నుండి ఎవరికి రక్షణ అవసరం ఉంటుంది?

టైఫాయిడ్ ఎవరికైనా రావచ్చు
టైఫాయిడ్ జ్వరము అసురక్షితమైన త్రాగు నీరు, అసురక్షితమైన ఆహారాన్ని తినడం లేదా మీ ఆహారాన్ని లేదా పానీయాలను సంక్రమణ సోకిన వ్యక్తి నిర్వహించడం వలన వ్యాప్తి చెందే ఒక తీవ్రమైన మరియు ప్రాణాంతక అనారోగ్యము.[1]

కుటుంబాలు మరియు గృహాలు
టైఫాయిడ్ కలుషితమైన నీరు, ముడి ఆహారము మరియు పరిశుద్ధత లేని జీవన పరిస్థితుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆహారాన్ని బాగా ఉడికించండి మరియు వంటచేసే ముందు మరియు తినేముందు మరియు శౌచాలయం ఉపయోగించిన తరువాత చేతులు కడుక్కోండి.
నివారణ
- మంచి పరిశుభ్రతను అలవరచుకోండి. తినేముందు మరియు శౌచాలయం ఉపయోగించిన తరువాత మరియు ఆహారాన్ని నిర్వహించే ముందు చేతులు కడుక్కోండి.
- ఆహారాన్ని బాగా ఉడికించండి మరియు దానిని సురక్షితంగా భద్రపరచండి.
- కేవలం పరిశుద్ధ లేదా మరిగించిన నీటిని మాత్రమే త్రాగండి.

పాఠశాలలు మరియు పిల్లలు
భోజన పెట్టెలు, నీళ్ళ సీసాలు పంచుకోవడం మరియు చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం ట్యాఫాయిడ్ ను వ్యాప్తి చేయవచ్చు. పాఠశాలలలో చేతులు కడుక్కోవడాన్ని ప్రోత్సహించండి, సురక్షితమైన త్రాగునీటి అందుబాటు మరియు టైఫాయిడ్ అవగాహనను నిర్ధారించండి.
నివారణ
- విద్యార్థులు మరియు సిబ్బందిలో చేతులు కడుక్కోవడాన్ని ప్రోత్సహించండి.
- పాఠశాల అల్పాహార కేంద్రాలలో సురక్షితమైన ఆహార నిర్వహణ ఆచరణలను నిర్ధారించండి.
- పరిశుభ్రమైన త్రాగు నీటిని అందించండి.

పెద్దలు మరియు వయోవృద్ధులైన పౌరులు
వయో వృద్ధులు మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉన్నవారికి టైఫాయిడ్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
నివారణ
- టైఫాయిడ్ కొరకు టీకా వేయించుకోవాలి.
- మంచి పరిశుభ్రతను అలవాటుచేసుకోవాలి, ముఖ్యంగా ప్రయాణించే సమయములో
- వీధి ఆహారాన్ని తినడములో జాగ్రత్తగా ఉండండి.

ప్రయాణీకులు
రద్దీ ఎక్కువగా ఉన్న లేదా అధిక-ప్రమాదం ఉన్న ప్రదేశాలకు ప్రయాణం చేయడం వలన టైఫాయిడ్ సంక్రమణ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
నివారణ
- ప్రయాణానికి ముందు టీకా వేయించుకోవాలి.
- సురక్షితమైన లేదా పరిశుద్ధ నీటిని మాత్రమే త్రాగాలి.
- పచ్చి లేదా సగం ఉడికించిన ఆహారాన్ని తినకండి.
- ఖచ్ఛితమైన పరిశుభ్రతను పాటించండి, తరచుగా చేతులు కడుక్కోవడముతో సహా.

పనిప్రదేశాలు మరియు ఉద్యోగులు
అపరిశుభ్రంగా ఉన్న పనిప్రదేశాలలో చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని మరియు పానీయాలను పంచుకోవడం ప్రమాదం పెంచుతుంది. వ్యాప్తిని నివారించుటకు సంస్థలు పరిశుభ్రత మరియు పారిశుధ్య ప్రమాణాలను అనుసరించాలి.
నివారణ
- చేతులు కడుక్కోవడం మరియు పరిశుభ్రతా ఆచరణలను ప్రోత్సహించాలి.
- శుభ్రమైన మరియు అందుబాటులో ఉన్న శౌచాలయాలు సమకూర్చాలి.
- కార్యాలయ వంటగదులు మరియు అల్పాహార కేంద్రాలలో సురక్షితమైన ఆహార నిర్వహణను ప్రోత్సహించాలి.
టీకా వేయించుకోవడం ద్వారా మీకు టైఫాయిడ్ జ్వరము మరియు దాని సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని మీరు మరియు మీ చుట్టూ ఉన్న వారిని రక్షించుటకు ఒక సులభమైన చర్య.
ఈరోజే వైద్యుడిని సంప్రదించండి.
మూలాలు
డిస్క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.