టైఫాయిడ్ ను నివారించడంలో టీకాలు ఎలా సహాయపడతాయి?

సాల్మొనెల్లా టైఫి వల్ల కలిగే టైఫాయిడ్ ఒక బ్యాక్టీరియల్ సంక్రమణ. ఇది భారతదేశములో ప్రధాన ప్రజారోగ్య ఆందోళనగా నిలిచింది. టైఫాయిడ్ కారణంగా అధిక జ్వరము, బలహీనత మరియు పొత్తికడుపు నొప్పికి దారితీయవచ్చు మరియు కొన్ని సందర్భాలలో ప్రాణాంతకం కూడా కావచ్చు. సంక్రమణను తగ్గించటానికి సాధారణంగా యాంటిబయాటిక్స్ ఉపయోగించబడినప్పటికీ, యాంటిమైక్రోబియల్ రెసిస్టెంట్ (AMR) పెంపు ఈ చికిత్సను మరింత సవాలుగా చేసింది. పారిశుధ్యము మరియు పరిశుభ్రతలలో పురోగతి ఒక నివారణాత్మక ఆరోగ్య సంరక్షణగా చాలా దోహదపడవచ్చు కాని మిమ్మల్ని మీరు వ్యాధి నుండి కాపాడుకునేందుకు టీకా చాలా ప్రభావవంతమైన మార్గముగా ఉంది.
అందుబాటులో ఉన్న టైఫాయిడ్ టీకా రకాలు ఏవి?
భారతదేశములో, రెండు రకాల టైఫాయిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి:
- వి క్యాప్సులార్ పాలీశాకరైడ్ (వి-పిఎస్) టీకా
- టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ (టిసివి)
వి క్యాప్సులార్ పాలీశాకరైడ్ (వి-పిఎస్) టీకా
వి-పిఎస్ టీకాలో ఎస్. టైఫి వ్యాధికారక లక్షణం యొక్క శుధ్ధిచేయబడిన యాంటిజెనిక్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఒకే మోతాదుగా ఇవ్వబడే ఈ టీకా మొదటి సంవత్సరములో సుమారు 61% రక్షణను ఇస్తుంది, అయితే కాలక్రమేణ దీని సామర్థ్యం తగ్గుతుంది. దీనితో ప్రతి మూడు సంవత్సరాలకు తిరిగి టీకా తీసుకోవలసిన అవసరం అవుతుంది. ఇది అంత ప్రభావవంతమైన నిరోధకతను అందించదు కాబట్టి, 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు మాత్రమే సిఫారసు చేయబడుతుంది మరియు శిశువులకు దీనిని ఇవ్వకూడదు.
వి క్యాప్సులార్ పాలీశాకరైడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ (టిసివి)
వి-పిఎస్ టీకా యొక్క పరిమితులను అధిగమించుటకు, వి-పాలీశాకరైడ్ యాంటిజెన్స్ వాహక ప్రోటీన్స్ కు కాంజుగేట్ చేయబడ్డాయి, తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ (టిసివిలు) ను ఆరు నెలల వయసు ఉన్న పిల్లల నుండి 65 సంవత్సరాల పెద్దల వరకు ఇవ్వవచ్చు మరియు దీర్ఘకాలిక నిరోధకతను అందించవచ్చు.
డబ్ల్యూహెచ్ఓ భారతదేశము వంటి స్థానిక దేశాలలో 6 నెలల నుండి 23 నెలల పిల్లలకు టిసివిలను సిఫారసు చేస్తుంది. ది ఇండియన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ 6 నెలల నుండి క్రమమైన ప్రతిరక్షణ పట్టికలను మరియు 9 నెలల వయసు నుండి మీజిల్స్ ఉన్న టీకాలు (MR లేదా AMR వంటివి) తో కలిపి ఇవ్వవచ్చు అని సిఫారసు చేస్తుంది. ఒకవేళ చిన్నవయసులో ఇవ్వకపోతే, MR లేదా AMR టిసివిని 65 సంవత్సరాల వయసు వరకు ఇవ్వవచ్చు.
టీకాకరణ ఎందుకు ముఖ్యమైనది?
టైఫాయిడ్ నివారణలో మెరుగైన పారిశుధ్యము మరియు పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుండగా, వాటి అమలుకు చాలాకాలం పడుతుంది. దీనితో జతపడిన అనారోగ్యం మరియు మరణాల కారణంగా టైఫాయిడ్ జ్వరము టీకాలు యాంటిమైక్రోబియల్ ప్రతిరోధకత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో చాలా అవసరం అవుతాయి.
యాంటిమైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR)
సాధారణంగా ఉపయోగించబడే యాంటిబయాటిక్స్ కు బ్యాక్టీరియా స్పందింకపోవడముతో టైఫాయిడ్ చికిత్స కష్టతరం అవుతోంది. ఇటీవలి కాలములో, ఎక్స్టెన్సివ్లీ డ్రగ్-రెసిస్టెంట్ (XDR) టైఫాయిడ్ అని పిలువబడే బలమైన జాతులు కూడా ఆవిర్భవించి శక్తివంతమైన యాంటిబయాటిక్స్ కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. దీనితో అజిథ్రోమైసిన్ మౌఖిక ఔషధ చికిత్సా ఎంపికలలో చివరిది అయింది. అయితే, అజిథ్రోమైసిన్ కు టైఫాయిడ్ ప్రతిరోధకమైన సందర్భాలు దక్షిణాసియాలో ఇప్పటికే నివేదించబడ్డాయి. దీనితో అధిక శక్తివంతమైన సూదిమందు యాంటిమైక్రోబియల్స్ ఉపయోగించకుండా టైఫాయిడ్ కు చికిత్స అందించలేది అవుతుందనే భయము తలెత్తుతోంది.
టైఫాయిడ్ టీకా యాంటిమైక్రోబియల్ ప్రతిరోధకతలను ఎదుర్కోగలవా?
యాంటిమైక్రోబియల్ ప్రతిరోధకతలను ఎదుర్కొనుటకు ఉత్తమమైన మార్గాలలో మొదటిది టైఫాయిడ్ ను నివారించడం. AMRను తగ్గించటానికి ఒక ప్రభావవంతమైన పరిష్కారముగా డబ్ల్యూహెచ్ఓ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ (టిసివిలు) ను సిఫారసు చేస్తుంది. టైఫాయిడ్ కేసుల సంఖ్యను తగ్గించడం ద్వారా, ఈ టీకాలు యాంటిబయాటిక్స్ వినియోగాన్ని తగ్గిస్తాయి, దీనితో డ్రగ్-రెసిస్టెంట్ జాతులు అభివృద్ధి చెందడం తగ్గుతుంది. ప్రజారోగ్య వ్యూహముగా విస్తృతమైన టీకాకరణ మహమ్మారులు ప్రబలకుండా నివారిస్తుంది, కమ్యూనిటీలను రక్షిస్తుంది మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ముగింపు
భారతదేశములో టైఫాయిడ్ ఆరోగ్య సమస్యగా నిలిచి ఉండగా, టీకాకరణ వంటి నివారణాత్మక చర్యలు ఈ సంక్రమణ మరియు యాంటిమైక్రోబియల్ ప్రతిరోధకత వ్యాప్తిని తగ్గించుటకు అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. పారిశుధ్యము మరియు పరిశుభ్రతలలో పురోగతులు కీలకం కాగా, ప్రమాదాన్ని తొలగించుటకు అవి పూర్తిగా సరిపోవు. డబ్ల్యూహెచ్ఓ మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ ద్వారా సిఫారసు చేయబడిన టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ (టిసివిలు), దీర్ఘ-కాలిక రక్షణను అందిస్తాయి మరియు శిశువులకు కూడా వీటిని ఇవ్వవచ్చు. అధిక టీకాకరణ వ్యాప్తిని నిర్ధారించడం ద్వారా, మనము టైఫాయిడ్ భారాన్ని, యాంటిబయాటిక్ వినియోగాన్ని తగ్గించగలుగుతాము మరియు డ్రగ్-ప్రతిరోధక జాతుల ఆవిర్భావాన్ని నివారించగలుగుతాము.
మూలాలు
డిస్క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.