నాకు టైఫాయిడ్ ఉందా అని నాకు ఎలా తెలుస్తుంది?
వేచి ఉండకండి లేదా ఊహించకండి, పరీక్ష చేయించుకోండి.

త్వరిత టైఫాయిడ్ నిర్ధారణపరీక్ష తీవ్రమైన సమస్యలు మరియు ఆసుపత్రిలో చేరిక నివారించడములో సహాయపడవచ్చు. అధిక-స్థాయి జ్వరం, బలహీనత, కడుపు నొప్పి, విరేచనాలు లేదా మలబద్ధకము వంటి ప్రారంభదశ లక్షణాలను మీరు గమనిస్తే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.[1] మీకు స్థిరంగా జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే, ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో టైఫాయిడ్ కేసులు ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా అక్కడ ఉన్నప్పుడు, ఎలాంటి ఆలస్యం చేయకుండా వైద్య సంరక్షణ అందుకోవాలి.[2]
రక్త పరీక్షలు టైఫాయిడ్ జ్వరము గురించి అత్యంత విశ్వసనీయమైన ధృవీకరణను అందిస్తాయి. మలము మరియు మూత్ర పరీక్షల తక్కువ విస్వసనీయత కారణంగా అవి సాధారణంగా సిఫారసు చేయబడవు.[2]
టైఫాయిడ్ కొరకు పరీక్షల రకాలు

మీ వైద్యుడు మీకు సన్నిపాత జ్వరం ఉందని సందేహించినప్పుడు టైఫాయిడ్ కొరకు శారీరిక పరీక్షలు ప్రారంభదశలో చేయబడతాయి. ఈ దశలలో, రోగులు పాలిపోయిన, నీరసించిన మరియు నిర్జలీకరణతో కనిపించవచ్చు. చర్మముపై దద్దుర్లు లేదా మచ్చలు కనిపించవచ్చు, ముఖ్యంగా ఛాతి మరియు పొత్తికడుపు (ముదురు వర్ణములో ఉన్న చర్మముపై చూడడం కష్టం కావచ్చు). మీ లక్షణాల ఆధారంగా, మీ వైద్యుడు టైఫాయిడ్ కొరకు పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు.[2]


టైఫాయిడ్ ప్రయోగశాల పరీక్షలు మామూలుగా రక్త నమూనాలతో, అరుదుగా మూత్రము, మలము మరియు ఎముక మజ్జతో చేయబడతాయి.[3]
రక్త సంస్కృతి పరీక్ష
రక్త సంస్కృతి పరీక్ష టైఫాయిడ్ పరీక్షించడం కోసం ఉన్న చాలా ప్రాధాన్యత కలిగిన, విశ్వసనీయమైన మరియు సాధారణమైన పద్ధతి, కాని దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.[2] దీనికి మొదటి వారములో 90% గుర్తింపు రేటు ఉంటుంది మరియు ఒక ప్రతికూల ఫలితము ధృవీకరించుటకు మైక్రోబయాలజి ప్రయోగశాలలో అయిదు రోజుల పరిశీలన అవసరం ఉంటుంది.[4]
ఎముక మజ్జ సంస్కృతి
స్పష్టమైన కారణం లేకుండా వారాల తరబడి ఉండే ఒక జ్వరాన్ని కనుగొనడానికి ఎముక మజ్జ సంస్కృతి అనేది ప్రాధాన్యత ఉన్న పరీక్షలలో ఒకటి. ఈ పరీక్ష యాంటిబయోటిక్ చికిత్స తరువాత కూడా బ్యాక్టీరియాను కనుగొనగలదు కాబట్టి, దీనిని అనారోగ్యము యొక్క తదుపరి దశలలో కూడా ఉపయోగించవచ్చు.[4] అయితే, ఈ పరీక్ష చొరబాటు కలిగినది మరియు అన్ని ఏర్పాట్లలో అనుకూలం కాకపోవచ్చు కాబట్టి ఇది సాధారణంగా ఉపయోగించబడదు.[5] తెలియని మూలము వలన కలిగిన జ్వరాన్ని పరీక్షించుటకు ఒకవేళ ఎముక మజ్జ సంస్కృతి నిర్వహించబడితే, టైఫాయిడ్ లేదని నిర్ధారించుటకు నమూనాలను సంస్కృతి పరీక్షల కొరకు పంపించాలి.
మలము సంస్కృతి
మలము సంస్కృతి టైఫాయిడ్ నిర్ధారించుటకు విశ్వసనీయమైనది కాదు, అది కోలుకుంటున్న రోగులలో కూడా సానుకూల ఫలితాలను చూపించవచ్చు. అయితే, ఇది ఎవరైనా దీర్ఘకాలిక వాహకాలు ఉన్నారా అని నిర్ణయించుటకు సహాయపడుతుంది. మూత్ర సంస్కృతి పరీక్ష టైఫాయిడ్ పరీక్షించుటకు ప్రామాణికమైన పద్ధతి కాదు.[2]
వైడల్ పరీక్ష
భారతదేశములో, వైడల్ పరీక్ష టైఫాయిడ్ జ్వరాన్ని కనుగొనుటకు విస్తృతంగా ఉపయోగించబడుతుంది.[2] ఇది టైఫాయిడ్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ప్రతిరక్ష కణాలు ఉనికిని కనుగొంటుంది మరియు అనారోగ్యము వచ్చిన రెండవ వారములో పరీక్షించబడుతుంది. అయితే, వైడల్ పరీక్షకు తక్కువ సున్నితత్వము మరియు నిర్దిష్టత ఉంటుంది, అంటే మలేరియా వంటి వ్యాధులు లేదా ఇతర బ్యాక్టీరియా వలన కలిగే సంక్రమణలో తప్పుడు సానుకూల ఫలితాలను చూపుతుంది.[4]
సంబంధిత పేజీలు
మూలాలు
డిస్క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.