Typhoid Needs Attention

టైఫాయిడ్‌ను ఎలా నివారించాలి?

టైఫాయిడ్ నివారించుటకు సులభమైన చర్యలు.

టైఫాయిడ్ నాలుగు Fల ద్వారా వ్యాప్తిస్తుంది అని చెప్పబడుతుంది – ఫ్లైస్, ఫింగర్స్, ఫీసెస్ మరియు ఫోమైట్స్ (ఈగలు, వేళ్లు, మలము మరియు ఉపరితలాలు) (సంక్రమణ వ్యాప్తిచేసే అవకాశం ఉన్న వస్తువులు).[1] ఇది పారిశుధ్యం మరియు సురక్షితమైన త్రాగునీటి సదుపాయాలకు అందుబాటు లేని సముదాయాలలో వేగంగా వ్యాపిస్తుంది.[2]

టైఫాయిడ్ నివారించుటకు, మీరు చేయవలసిన మూడు ప్రధానమైన పనులు ఉన్నాయి:[3]

చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవాలి

సురక్షితమైన ఆహారం తినడం మరియు సురక్షితమైన నీటిని త్రాగడం వంటి అలవాట్లు అలవరచుకోవాలి

టీకా వేయించుకోవాలి

WASH నియమావళి

శుభ్రమైన నీరు, తగిన పారిశుధ్యం మరియు పరిశుభ్రత చర్యలు లేకపోవడం వలన సముదాయాలలో ఎక్కువమంది అనారోగ్యం బారిన పడవచ్చు. నీటి, పారిశుద్ధ్య మరియు పరిశుభ్రత (WASH) నియమావళిని పాటించడం ద్వారా టైఫాయిడ్ ను నివారించవచ్చు. మెరుగైన WASH మౌలికసదుపాయము టైఫాయిడ్ మరియు ఇతర సంక్రామిక వ్యాధుల కేసులను తగ్గించేందుకు పునాది అవుతుంది.[1]

ఒకవేళ సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే, ఆల్కహాల్-ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి.[3]

ఆహారం మరియు పానీయాల భద్రత

పానీయాల భద్రత[3]

  • వడగట్టిన లేదా మరిగించిన నీటిని త్రాగండి లేదా సీసా నీటిని ఉపయోగించండి (నీటిని త్రాగే ముందు కనీసము 1 నిమిషము పాటు మరిగించండి)
  • ఐస్ క్రీమ్స్, పాప్సికిల్స్ లేదా ఐస్ యొక్క సందేహాస్పద మూలాలకు దూరంగా ఉండండి (మినరల్ లేదా మరిగించిన నీటితో తయారుచేయబడితే మినహా)
  • పాశ్చరైజ్ చేయని పాలు త్రాగకండి

ఆహార భద్రత[3,4]

  • బాగా వండిన ఆహారాన్ని మాత్రమే తినండి
  • కూరగాయలు మరియు పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగిన తరువాత మాత్రమే తినండి
  • తాజాగా వండినప్పుడు తప్ప, వేడిగా వడ్డించబడి మరియు పరిశుభ్రంగా తయారుచేయబడితే తప్ప, వీధి ఆహారం తినకండి
  • పాశ్చరైజ్ చేయని డైరీ ఉత్పత్తులను తినకండి
  • సరిగ్గా ఉడకని గ్రుడ్లు తినకండి

టీకాకరణ

WASH నియమావళి దేశము మూలమూలల వరకు చేరటానికి సంవత్సరాల కాలం పడుతుండగా, టీకాకరణ అనేది సముదాయాలలో చాలా వేగంగా చేరుకుంటుంది (కోవిడ్ సమయములో అనుభవములోకి వచ్చిన విధంగా). టైఫాయిడ్ ప్రమాదము ఎక్కువగా ఉన్న దేశాలు వ్యాధి వ్యాప్తిని తగ్గించుటకు నివారణాత్మక చర్యగా టీకాకరణను పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‎ఓ) సిఫారసు చేస్తుంది.[5]

భారతదేశములో, రెండు రకాల టైఫాయిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి:[5]

టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ (టిసివి)

ఒక వ్యాధివాహక పోషకపదార్థముతో కలపబడిన వి పాలీశాకరైడ్ యాంటిజెన్ ఉన్న ఒక సూదిమందుతో చేయబడే టీకా.

వి పాలీశాకరైడ్ (వి -పిఎస్) టీకా

శుద్ధి చేయబడిన వి యాంటిజన్ పై మాత్రమే ఆధారపడిన సూదిమందుతో చేయబడే ఒక కాంజుగేట్ చేయబడని పాలీశాకరైడ్ టీకా.

టైఫాయిడ్ టీకాల యొక్క పోలిక[5,6]

ఫీచర్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ (టిసివి)* వి పాలీశాకరైడ్ (వి -పిఎస్)
సమర్థత 87.1% వరకు 55-61%
వయసు 6 నెలలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇవ్వవచ్చు 2 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇవ్వవచ్చు
ఇవ్వబడే విధానము సూదిమందు సూదిమందు
రక్షణ కనీసము 7 సంవత్సరాలు గరిష్ఠంగా 2 నుండి 3 సంవత్సరాల వరకు

+పై పట్టిక కొరకు సమాచారము టైప్‎బార్-టిసివి పై నిర్వహించిన అధ్యయనాల నుండి తీసుకోబడింది. ఇతర టిసివి టీకాల సమాచారము అందుబాటులో లేదు.

డబ్ల్యూహెచ్‎ఓ-ఎస్‎ఏజిఈ వర్కింగ్ గ్రూప్ ఆన్ టైఫాయిడ్ వ్యాక్సిన్స్ 6 నుండి 23 నెలల వరకు వయసు ఉన్న పిల్లల కొరకు ప్రతిరక్షణ కార్యక్రమాలలో భాగంగా టిసివి ని సిఫారసు చేస్తుంది.[6] ఈ టీకా ఇచ్చిన తరువాత కనీసము 28 రోజుల తరువాత రక్షణ అందించడం ప్రారంభిస్తుంది.
గమనిక: సరైన మోతాదు కోసం దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.[7]

టైఫాయిడ్ జ్వరాన్ని నివారించుటకు ఉత్తమ మార్గము ఏది?

టైఫాయిడ్ కు వ్యతిరేకంగా WASH + టీకాకరణ ఉత్తమమైన రక్షణలు. మెరుగైన పరిశుభ్రత మరియు పారిశుధ్యము ప్రమాదం తగ్గిస్తుండగా, వీటికి తోడుగా టీకా సంక్రమణ సంభావ్యతను కూడా తగ్గిస్తుంది.

మూలాలు

డిస్‎క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.

Scroll to Top
This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.