టైఫాయిడ్ లక్షణాలు ఏమిటి?
వాటిని ప్రారంభదశలో గుర్తిస్తే, సమస్యలను నివారించవచ్చు

టైఫాయిడ్ లేదా సన్నిపాత జ్వరం లక్షణాలు బ్యాక్టీరియాకు బహిర్గతం అయిన 1 నుండి 3 వారాలలో కనిపించవచ్చు మరియు కొన్ని రోజులలో లేదా వారాలలో క్రమంగా తీవ్రం కావచ్చు.
టైఫాయిడ్ జ్వరం[1] చిహ్నాలు మరియు లక్షణాలు

క్రమంగా పెరిగే అధిక జ్వరం (నిచ్చెన మెట్ల వైఖరి)

తలనొప్పి

చలి

బలహీనత లేదా అలసట

ఆకలి లేకపోవడం

కడుపునొప్పి

దద్దుర్లు లేదా మచ్చలు (సాధారణంగా ఛాతి లేదా కడుపుపైన, ముఖ్యంగా తెల్లని చర్మముపైన)

దగ్గు

అధిక చమటలు

కండరాల నొప్పులు

వికారము మరియు వాంతులు

విరేచనాలు లేదా మలబద్ధకము
జాగ్రత్తగా ఉండండి[2]
టైఫాయిడ్ బ్యాక్టీరియా ఎలాంటి లక్షణాలను కలిగించకుండా శరీరములో ఉండవచ్చు. దీనిని లక్షణాలు లేని సంక్రమణ అని అంటారు.
చికిత్స చేయకుండా వదిలేస్తే, టైఫాయిడ్ సమస్యలు తీవ్రం కావచ్చు, అది పేగులలో రక్తస్రావము, చిల్లులు మరియు మెదడు వాపుకు దారితీయవచ్చు. మెదడు వాపు తికమక లేదా మనోవ్యాధి కలిగిస్తుంది.
లక్షణాలు అదృశ్యం అయిన తరువాత కూడా, కొంతమందిలో ఇంకా బ్యాక్టీరియా ఉంటుంది మరియు తెలియకుండా వారి మలము ద్వారా ఇతరులకు వ్యాప్తి చేస్తారు.

సంబంధిత పేజీలు
మూలాలు
డిస్క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.