Typhoid Needs Attention

టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫి[1] వలన కలిగే తీవ్రమైన సంక్రమణ. ఇది కలుషితమైన ఆహారము మరియు నీటి ద్వారా[2] వ్యాప్తి చెందే ఒక రకమైన సన్నిపాత జ్వరము. ఈ బ్యాక్టీరియా కేవలం మనుషులలో నివసిస్తుంది మరియు మన శరీరాలు ఎలాంటి లక్షణాలను చూపకుండా సుదీర్ఘకాలం (కొన్నిసార్లు సంవత్సరాల వరకు) వాటిని మోస్తాయి, మరియు తెలియకుండా మనం వాటిని ఇతరులకు సంక్రమింపజేస్తాము. ఒకవేళ కలుషితమైన ఆహారము లేదా నీటిని తీసుకున్నప్పుడు, ఈ బ్యాక్టీరియా జీర్ణవాహికను ఆక్రమిస్తుంది మరియు రక్తప్రవాహము ద్వారా శరీరములోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.[3] సరైన చికిత్స అందకపోతే, టైఫాయిడ్ తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు మరియు ప్రాణాంతక ప్రమాదాలను కలిగించవచ్చు. 5 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఈ వ్యాధి వలన తీవ్రంగా ప్రభావితం అవుతారు.[4]

Difference between typhoid and paratyphoid

Typhoid’s definition is similar to paratyphoid. Both are similar diseases caused by two variations of the Salmonella enterica bacteria. Both diseases have similar symptoms, but paratyphoid is less severe and less common than typhoid.4

ఇది ఎలా వ్యాపిస్తుంది?

షెడ్డింగ్

టైఫాయిడ్ వ్యాధి ‘షెడ్డింగ్’ అనే ఒక ప్రక్రియ ద్వారా వ్యాపిస్తుంది, ఇందులో బ్యాక్టీరియా మలవిసర్జన సమయములో సంక్రమణ సోకిన వ్యక్తి శరీరము నుండి బయటికి వెళ్తుంది. సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియాను విడుదల చేస్తున్న వ్యక్తి ద్వారా ఆహారము లేదా పానీయాలను మీరు తీసుకున్నప్పుడు మీకు టైఫాయిడ్ రావచ్చు.[5]

తీసుకోవడం

ప్రజలు బ్యాక్టీరియాను శరీరములోకి తీసుకున్నప్పుడు అనారోగ్యం పాలౌతారు. ఇది సాధారణంగా మురుగునీరు ద్వారా కలుషితం అయిన ఆహారము లేదా పానీయాల ద్వారా, కలుషితమైన నీటితో కడిగిన ప్లేట్లలో తినడం ద్వారా లేదా శౌచాలయాలు ఉపయోగించిన తరువాత వారి చేతులను కడుక్కోని వారు తాకిన ఆహారాన్ని తినడం ద్వారా జరుగుతుంది.[6]

కలుషితమైన ఆహారము మరియు నీరు

ఇది పండ్లు మరియు సలాడ్స్ వంటి సరిగ్గా కడగని లేదా సరిగ్గా వండని ఆహార పదార్థాల ద్వారా లేదా అసురక్షితమైన ఐస్ క్యూబ్స్ లేదా అసురక్షితమైన పండ్ల రసాల రూపములో కలుషితమైన త్రాగునీటి ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు.[7]

దీర్ఘకాలిక వ్యాధివాహకులు

టైఫాయిడ్ బారిన పడిన వ్యక్తులు బ్యాక్టీరియాను వారి జీర్ణవాహికలో కలిగి ఉంటారు. దీనిని వారు వారి మలము ద్వారా ఎప్పటికప్పుడు వదిలిపెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో, టైఫాయిడ్ నుండి కోలుకున్నవారు చాలాకాలం వరకు తమ పేగులలో బ్యాక్టీరియాను కలిగి ఉంటారు. వారికి లక్షణాలు ఉండకపోవచ్చు కాని బ్యాక్టీరియాను వ్యాప్తి చేయడం కొనసాగిస్తారు.[1]

ప్రమాద కారకాలు ఏమిటి?

పరిశోధనల ప్రకారం, ప్రపంచంలోని సగం టైఫాయిడ్ కేసులు భారతదేశములో ఉండే అవకాశం ఉంది. సముదాయ మరియు ఆసుపత్రి డేటాను సమీకరించి, నివేదించని కేసులను పరిగణనలోకి తీసుకుని ఈ విశ్లేషణ చేపట్టబడింది.

ప్రారంభ దశలలో, రోగులు సాధారణంగా తలనొప్పి, వికారము మరియు పొత్తికడుపు నొప్పితో కూడిన జ్వరముతో బాధపడతారు. దీనికి చికిత్స అందకపోతే ఇది తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.[1]

టైఫాయిడ్ వలన చిన్న పేగులలో పుండ్లు వస్తాయి, ఇవి పేగుల నుండి రక్తస్రావానికి దారితీయవచ్చు. కొన్ని తీవ్రమైన కేసులలో, ఇది చిన్న పేగుల పాడైన గోడల నుండి రక్తనాళాలలోకి ప్రవేశిస్తుంది, ఇది సెప్సిస్ కు దారితీస్తుంది. మరికొన్ని కేసులలో, ఇది గుండె, క్లోమము లేదా మెదడు ఆనుకునే పొరల్లో వాపు కలిగించవచ్చు మరియు మూత్రపిండాలను కూడా ప్రభావితం చేయవచ్చు.[7]

టైఫాయిడ్ జ్వరము సోకిన కొంతమంది రోగులలో మెదడు రుగ్మత, తికమక, నిద్ర సమస్యలు, భ్రాంతి రుగ్మత, మతిమరుపు మరియు కండరాల దృఢత్వం వంటి నరాల సంబంధ సమస్యలు పెరగవచ్చు.[10]

ఇది హెపాటో-స్ప్లీనోమెగాలి కూడా కలిగించవచ్చు, ఇది కాలేయము మరియు ప్లీహం రెండు వ్యాకోచం చెందే ఒక పరిస్థితి.[9] దీర్ఘకాలిక వ్యాధివాహక స్థితి పిత్తాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చు.[11]

మూలాలు

డిస్‎క్లెయిమర్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా ఒక ప్రజా అవగాహన కార్యక్రమము. ఈ సమాచారము సాధారణ అవగాహన కొరకు మాత్రమే మరియు ఎలాంటి వైద్య సలహా అందించదు. చూపించబడిన వైద్యులు, వైద్య సదుపాయాలు మరియు గ్రాఫిక్స్ కేవలం ఉదాహరణ కొరకు చూపించబడినవే. మీ వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నల ఉంటే, మీ వైద్యుడి నుండి సలహా తీసుకోండి.

Scroll to Top
This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.