టైఫాయిడ్ ఒక సాధారణ జ్వరము కంటే ఎక్కువ
సమస్యలు అంత విలువైనవి కాదు. ప్రమాదాన్ని అర్థంచేసుకోవాలి, దీని గురించి మీ వైద్యుడితో చర్చించండి మరియు సురక్షితంగా ఉండేందుకు సమయానుకూలమైన మరియు అనుగుణమైన చర్యను తీసుకోండి.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో టైఫాయిడ్ కేసులు భారతదేశంలోనే ఉన్నాయి.*[1,2] అయినా, దాని గురించి మీకు ఎంతవరకు తెలుసు?
ముందస్తు నివారణాత్మక చర్యలు తీసుకోకపోతే, మీరు ప్రమాదములో పడవచ్చు.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్ టైఫాయిడ్ కేసులు నివేదించబడుతున్నాయి[3]

టైఫాయిడ్ లక్షణాలు సాధారణంగా ఒక వ్యక్తి సంక్రమణకు గురైన 1 లేదా 2 వారాల తరువాత కనపడుతాయి[4]

సరైన చికిత్స అందించకపోతే, 30% కేసులలో టైఫాయిడ్ ప్రాణాంతకం కావచ్చు[3]
2017 నుంచి 2020 మధ్య సేకరించిన డేటా ప్రకారం, ప్రపంచంలో సగానికి పైగా టైఫాయిడ్ భారాన్ని భారతదేశం భరిస్తోంది. ప్రస్తుత డేటా వేరుగా ఉండవచ్చు.
మూలాలు: జాన్ ఎట్ అల్., ఎన్‌ఇజేఎం 2023; కావో ఎట్ అల్., జెఐడి 2021.
టైఫాయిడ్ ఒక తీవ్రమైన ఆరోగ్య ఆందోళనగా ఎందుకు పరిగణించబడుతుంది?

యాంటిమైక్రోబియల్ ప్రతిరోధకత
యాంటిమైక్రోబియల్ ప్రతిరోధకత – విస్తృతమైన (విపరీతమైన మరియు విజ్ఞతకు విరుద్ధమైన) యాంటిబయాటిక్ వినియోగము యాంటిబయాటిక్ ప్రతిరోధకత (ఏఎంఆర్) కు ఆజ్యంపోసింది, ఇది మరింత ఔషధ-ప్రతిరోధక టైఫాయిడ్ బ్యాక్టీరియాకు దారితీసింది, తద్వారా సమస్యలు పెరిగాయి మరియు టైఫాయిడ్ చికిత్సలో ఉపయోగించబడే సాధారణ ఔషధాలతో చికిత్స కష్టం అయింది.[6]

దైహిక సంక్రమణ
రక్తము నుండి అవయవాల వరకు టైఫాయిడ్ పేగుల ద్వారా వ్యాపించి అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. దీనికి చికిత్స అందించకపోతే, అది తీవ్రమైన లక్షణాలను మరియు సమస్యలను ప్రేరేపించవచ్చు, దీనితో చాలా బాధ, విస్తృతమైన నష్టము మరియు సంభావ్య ప్రాణాంతక ఫలితాలు కలుగుతాయి.[7]

అంటువ్యాధి
టైఫాయిడ్ కలుషితమైన ఆహారము మరియు నీటి ద్వారా సంక్రమిస్తుంది, తద్వారా అసురక్షితమైన నీరు లేదా ఆహారము, సరిగ్గాలేని వ్యక్తిగత పరిశుభ్రత ప్రమాణాలు మరియు తక్కువ పారిశుధ్యము ఉన్న ప్రాంతాలలో, మహమ్మారులకు ఆజ్యంపోస్తుంది, మరియు ప్రజా ఆరోగ్యానికి గణనీయమైన హానిని కలిగిస్తుంది.[8]

వాహక స్థితి
కోలుకున్న తరువాత కూడా, వ్యక్తులు తెలియకుండా తమ పేగులలో టైఫాయిడ్ బ్యాక్టీరియాను కలిగి ఉంటారు, ఇది వ్యాపించవచ్చు మరియు కొత్త సంక్రమణల ప్రమాదాన్ని సృష్టించవచ్చు మరియు వ్యాధి నియంత్రణకు ఆటంకాలు కలిగించవచ్చు.[8]
టైఫాయిడ్ నివారణ అందుబాటులోనే ఉంటుంది!
టైఫాయిడ్ నుండి రక్షించుకోవటానికి కొన్ని సులభమైన చర్యలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
టీకాకరణ

టీకా వేయించుకోండి
పరిశుభ్రత నియమావళి (నీరు)

పరిశుభ్రమైన త్రాగునీటిని త్రాగండి
పరిశుభ్రత నియమావళి (పారిశుద్ధ్యం)

సురక్షితమైన పారిశుధ్యాన్ని అభ్యాసం చేయండి
పరిశుభ్రత నియమావళి (చేతుల పరిశుభ్రత)

మంచి చేతుల పరిశుభ్రతను పాటించండి
టైఫాయిడ్ నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సురక్షితంగా ఎలా ఉంచాలి అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
టైఫాయిడ్ గురించి మీరు తెలుసుకోవలసినది
తప్పు సమాచారం ప్రమాదకరం కావచ్చు. నిజాలు తెలుసుకోండి, ప్రమాదాలను అర్థంచేసుకోండి మరియు మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని రక్షించుకొనుటకు సరైన చర్యలు తీసుకోండి.

టైఫాయిడ్ గురించి మీరు తెలుసుకోవలసినది
తప్పు సమాచారం ప్రమాదకరం కావచ్చు. నిజాలు తెలుసుకోండి, ప్రమాదాలను అర్థంచేసుకోండి మరియు మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని రక్షించుకొనుటకు సరైన చర్యలు తీసుకోండి.


ఒక అంతర్దృష్టి:
ఆరోగ్యసంరక్షణ వృత్తినిపుణులకు టైఫాయిడ్ అంతర్దృష్టులు
తాజా పరిశోధన, సాంక్రమిక రోగ విజ్ఞానము, వైద్య మార్గదర్శకాలు మరియు రోగనిర్ధారణ, చికిత్స మరియు టైఫాయిడ్ నివారణలను మెరుగుపరచుటకు రుజువు-ఆధారిత వ్యూహాలతో సమాచారం తెలుసుకుంటూ ఉండండి.
తరచు అడగబడే ప్రశ్నలు
టైఫాయిడ్ అంటే ఏమిటి?
టైఫాయిడ్ జ్వరము సాల్మొనెల్ల టైఫి అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది మరియు ఇది కలుషిత ఆహారము మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. సంక్రమణ సోకిన రోగులలో తలనొప్పి, కడుపునొప్పి మరియు బలహీనతలతోపాటు క్రమంగా పెరుగుతున్న జ్వర లక్షణాలు ఉంటాయి.[6]
టైఫాయిడ్ జ్వరము యొక్క సాధారణ లక్షణాలు ఏవి?
టైఫాయిడ్ యొక్క అతి సాధారణమైన లక్షణాలు ప్రతిరోజు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తలనొప్పి, తీవ్రమైన అలసట, కడుపునొప్పి మరియు మలబద్ధకము లేదా విరేచనాలతో స్థిరంగా ఉన్న జ్వరము.[9]
టైఫాయిడ్ దీర్ఘ-కాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందా?
చికిత్స అందించకపోతే, టైఫాయిడ్ పేగులలో రక్తస్రావము లేదా చిల్లులతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. తీవ్రమైన కేసులలో, ఇది మెదడుతో సహా ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు.[10,7]
సంక్రమణ సోకిన వ్యక్తిని అనుకోకుండా తాకడం ద్వారా టైఫాయిడ్ వ్యాపిస్తుందా?
లేదు, సంక్రమణ సోకిన వ్యక్తిని నేరుగా లేదా అనుకోకుండా తాకినప్పుడు టైఫాయిడ్ జ్వరము వ్యాపించదు. కాని వాళ్ళు తాకినవి ఏవైనా మీరు తాకినప్పుడు, ముఖ్యంగా వాళ్ళు శౌచాలయానికి వెళ్ళిన తరువాత చేతులు కడుక్కోకపోతే, మీకు టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది.[11]
టైఫాయిడ్ నుండి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
మీరు టైఫాయిడ్ కోసం చికిత్స ప్రారంభించిన తరువాత, మీకు కొన్ని రోజులకే మెరుగ్గా ఉంటుంది. జ్వరము నుండి పూర్తిగా కోలుకోవటానికి 10 రోజుల వరకు పట్టవచ్చు మరియు అలసట మరియు బలహీనతలు తగ్గటానికి మరింత సమయం పట్టవచ్చు. అయితే, ఒకవేళ మీకు సమస్యలు లేదా పునఃస్థితి ఉంటే, కోలుకోవటానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు.[10]
అందుబాటులో ఉన్న వివిధ రకాల టైఫాయిడ్ టీకాలు ఏవి?
- టైఫాయిడ్ కాంజుగేట్ టీకా (టిసివి)
- వి పాలీశాకరైడ్ (వి-పిఎస్)[11]
మూలాలు
- https://www.nejm.org/doi/pdf/10.1056/NEJMoa2209449
- https://pubmed.ncbi.nlm.nih.gov/35238365/
- https://immunizationdata.who.int/global/wiise-detail-page/typhoid-reported-cases-and-incidence?CODE=Global&YEAR=
- https://www.nhs.uk/conditions/typhoid-fever/symptoms/
- https://acvip.org/parents/columns/typhoid.php
- https://www.ncbi.nlm.nih.gov/books/NBK557513/
- https://www.mayoclinic.org/diseases-conditions/typhoid-fever/symptoms-causes/syc-20378661
- https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC10236512/
- https://www.nhs.uk/conditions/typhoid-fever/symptoms/
- https://my.clevelandclinic.org/health/diseases/17730-typhoid-fever
- Purple Book: IAP Guidebook on Immunization 2022 By Advisory Committee on Vaccines and Immunization Practices (ACVIP)